Hyd News: మాదాపూర్‌లో ఇద్దరు డ్రగ్‌ స్మగ్లర్ల అరెస్ట్‌

Hyd News: రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల MDMA డ్రగ్స్‌ స్వాధీనం

Shashank Gullapelli
Published on: 17 April 2024 6:26 PM IST
Two Drug Smugglers Arrested In Madhapur
X

Hyd News: మాదాపూర్‌లో ఇద్దరు డ్రగ్‌ స్మగ్లర్ల అరెస్ట్‌

Hyd News: ఇద్దరు డ్రగ్‌ స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు మాదాపూర్‌ పోలీసులు. సైబరాబాద్‌ ఎస్వోటీ మాదాపూర్ టీమ్‌తో పాటు మాదాపూర్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులను వారు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4లక్షలకు పైగా విలువైన 28 గ్రాముల MDMA డ్రగ్స్‌ తో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజమండ్రికి చెందిన సూర్యకుమార్‌, శ్యామ్‌బాబుగా గుర్తించారు. బెంగళూరులో ఓ నైజీరియన్ వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story