మేడారం జాతరలో అపశృతి

మేడారం జాతరలో అపశృతి
x
జంపన్నవాగు
Highlights

మేడారం జాతరలో అపశ‌ృతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో స్నానం చేస్తుండగా మూర్ఛ వచ్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సికింద్రాబాద్ కు చెందిన వినయ్ , ఖమ్మం...

మేడారం జాతరలో అపశ‌ృతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో స్నానం చేస్తుండగా మూర్ఛ వచ్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సికింద్రాబాద్ కు చెందిన వినయ్ , ఖమ్మం జిల్లా దుమ్మగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్ లు మరణించారు. భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులో గోతులు, అక్కడక్కడ సుడిగుండాలు కూడా ఉండవచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు వాగులోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను కనిపెట్టుకుని ఉండాలి.

మేడారం మహా జాతర - 2020 కు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి 8వ తేదీ వరకూ ఈ మహాజాతర జరుగుతుంది. జాతరలో భాగంగా తొలిరోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. సారలమ్మ కన్నేపల్లి నుంచి సాయంత్రం 8గంటల ప్రాంతంలో గద్దెల వద్దకు చేరుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories