Weather Report in Telangana: తెలంగాణలో నేడు,రేపు వర్షాలు కురిసే అవకాశం

Weather Report in Telangana: రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Kranthi
Published on: 10 April 2021 7:52 AM IST
Two Days Rain Forecast for Telangana
X

Weather Report in Telangana:(Photo The Hans India)

Weather Report in Telangana: రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భారీగా ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 24.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

మరోవైపు ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ 40.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి, విదర్భ నుంచి తెలంగాణ ఇంటీరియల్‌ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియల్‌ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పంటలు చేతికందే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే గిట్టుబాటు ధర రాక అల్లాడుతున్న రైతు సోదరులకు అకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Kranthi

Kranthi

Next Story