Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్ష సూచన

Weather Update: వాతా‌వ‌ర‌ణంలో వచ్చిన మార్పుల కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Arun Chilukuri
Published on: 7 May 2021 12:23 PM IST
Two Days of Rain Forecast for Telugu States
X

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్ష సూచన

Weather Update: వాతా‌వ‌ర‌ణంలో వచ్చిన మార్పుల కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కర్ణా‌టక పరి‌సర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తున ఉప‌రి‌తల ద్రోణి కొన‌సా‌గుతుంది. దీని ప్రభా‌వంతో రాబోయే రెండు రోజుల్లో ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లులు, వడ‌గం‌డ్లతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. తెలం‌గాణ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదే‌శాల్లో తేలికపాటి వర్షం కురిసే అవ‌కాశముందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story