Sravani Case : దేవరాజ్ పెళ్లి చేసుకోను అన్నందుకే.. శ్రావణి ఆత్మహత్య కేసులో రిమాండ్ రిపోర్ట్!

Sravani Case : దేవరాజ్ పెళ్లి చేసుకోను అన్నందుకే.. శ్రావణి ఆత్మహత్య కేసులో రిమాండ్ రిపోర్ట్!
x
Highlights

Sravani Case : కొండపల్లి శ్రావణి అందం అభినయం ఉన్న ఓ బుల్లితెర నటి. ఆమె నటించింది కొన్ని సీరియల్లే అయినా ఆమె అభినయంతో ఎంతో అభిమానులను సంపాందించుకుంది....

Sravani Case : కొండపల్లి శ్రావణి అందం అభినయం ఉన్న ఓ బుల్లితెర నటి. ఆమె నటించింది కొన్ని సీరియల్లే అయినా ఆమె అభినయంతో ఎంతో అభిమానులను సంపాందించుకుంది. అలాంటి శ్రావణి అనుకోకుండా ఒకరోజు బలవన్మరనానికి పాల్పడింది. శ్రావణి బాత్రూంలోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో ఖంగారుపడిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు చక్కటి భవిష్యత్తు, చేతి నిండా ఆఫర్లు ఉన్నప్పటికీ అసలు ఆమె ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడింది. ఆమె చావుకు కారణం ఏమయివుంటుంది అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అప్పుడే మెళ్లిమెళ్లిగా ఒక్కో నిజం బయటికి రావడం మొదలయింది. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణికి దగ్గరయ్యాడు ఆ తరువాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మనస్థాపం చెందిన శ్రావణి ఆత్మహత్యకు చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

ఆ తరువాత ఈ కేసులో మెళ్లిగా సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి ల పేర్లు తెరమీదికి వచ్చాయి. దీంతో ఈ కేసులు అనేక మలుపులు, ట్విస్టులు మొదలయ్యాయి. నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మొన్న (ఆదివారం) మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు ఏ3 గా దేవరాజ్‌పేరును వెల్లడించారు. కానీ ఈ రోజు వెలువడిన రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు A1 గా దేవరాజ్ రెడ్డి, A2 గా సాయి కృష్ణ రెడ్డి, A3 గా అశోక్ రెడ్డి ని చేర్చారు.

ముందు ఏ3 గా దేవరాజ్‌ నమోదు చేసిన పోలీసులు మళ్లీ కేసును క్షుణ్ణంగా విచారించారు. ఈ సుమారు 17 మంది సాక్షులను విచారించిన పోలీసులు దేవరాజ్ ను ఏ1 గా పేర్కొన్నారు. ఈ విచారణలో బయటపడిన విషయాల్లోకెళితే కుటుంబ సభ్యుల ముందు దేవ్ రాజ్ రెడ్డికి ప్రపోజ్ చేసిన శ్రావణి తనను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో కోరింది. అంతే కాదు శ్రావణి కుటుంబసభ్యులు కూడా ఆమెను పెళ్లి చేకోవాలని దేవ్ రాజ్ ను అడగడంతో ససేమిరా అన్నాడు. అయినా శ్రావణి దేవ్ రాజ్ ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే శ్రావణికి సాయి కృష్ణ, అశోక్ రెడ్డి లతో రిలేషన్ ఉండటంతో దేవ్ రాజ్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ శ్రావణి దేవ్ రాజ్ ను కలవడానికి మెసెజ్ లు, ఫోన్ కాల్స్ తో ప్రయత్నించింది. ఆ విషయం తెలుకున్న సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను బెదిరించారు.

అయితే సెప్టెంబర్ 7వ తేదీన అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ ఉన్న శ్రావణిని దేవరాజ్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్లారు. అదే రోజు సరిగ్గా 9:30pm కి శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయి కృష్ణ రెడ్డి అక్కడున్న శ్రావణి ని కొట్టి ఆటోలో తీసుకెళ్లిపోయాడు. దేవ్ రాజ్ తో కలవకూడదని సాయి, అశోక్ రెడ్డి శ్రావణిని బెదిరించారు. అంతేకాదు దేవ్ రాజ్ ను చంపేసి, ఆర్థికంగా ఆదుకోము అని బెరింపులకు పాల్పడ్డారు. దీంతో బెదిరిపోయిన శ్రావణి దేవ్ రాజ్ కు కాల్ చేసి హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని కోరింది. కానీ దేవ్ రాజ్ శ్రావణితో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఒక వైపు దేవ్ రాజ్, మరో వైపు సాయి కృష్ణ, అశోక్ రెడ్డి ల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు దేవ్ రాజ్, సాయి కృష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసును మరింత లోతుగా విచారించిన తరువాతే పోలీసులు ఈ రకమైన మార్పులు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories