Top
logo

Sravani Case: ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు !

Sravani Case: ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు !
X
Highlights

సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. శ్రావణి...

సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. శ్రావణి మృతి కేసులో పోలీసులు టిస్ట్‌ ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ 2 గా సాయి కృష్ణారెడ్డి, ఏ 3 గా అశోక్ రెడ్డిని చేర్చారు. అయితే, మొన్న (ఆదివారం) మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఏ3 గా దేవరాజ్‌ పేరును వెల్లడించిన పోలీసులు తాజాగా అతన్ని ఏ1 గా పేర్కొన్నారు. కేసును మరింత లోతుగా విచారించిన తరువాతే పోలీసులు ఈ రకమైన మార్పులు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణి ఎంతగా కోరినా దేవరాజ్ ఒప్పుకోలేదని.. ఈ కారణంగానే శ్రావణి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.Web Titletwist in tv serial actress Sravani suicide case
Next Story