Thummala: రాహుల్‌తో తుమ్మల.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం..

Tummala Nageswara Rao Meets Rahul Gandhi
x

Tummala: రాహుల్‌తో తుమ్మల.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం..

Highlights

Thummala Nageswara Rao: అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమని చెప్తే అక్కడి నుంచే బరిలోకి దిగుతానన్నారు కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు.

Thummala Nageswara Rao: అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమని చెప్తే అక్కడి నుంచే బరిలోకి దిగుతానన్నారు కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు తుమ్మల. అనంతరం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నాని తుమ్మల అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే పార్టీలో సమీకరణల దృష్ట్యా అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా చేస్తానని అన్నారు. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని తెలిపారు తుమ్మల. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా సమిష్టిగా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తుమ్మల స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories