L Ramana: టీఆర్ఎస్ గూటికి టీటీడీపీ అధ్యక్షుడు
నేడు ప్రగతిభవన్‌కు వెళ్లనున్న టీటీడీపీ అధ్యక్షుడు.. సిఎం కేసీఆర్‌తో సమావేశం త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్న ఎల్ రమణ
ఎల్. రమణ
L Ramana: తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మారబోతున్నారు. త్వరలోనే గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశంకానున్నారు ఎల్.రమణ. త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు క్యాబినెట్‌లో ఎల్ రమణ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
Next Story




