L Ramana - అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్న
L Ramana: ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలంటే అనుభవజ్నులు రావాలని తనను కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిపారు మాజీ టీ.టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ.
అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా- L Ramana
L Ramana: ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలంటే అనుభవజ్నులు రావాలని తనను కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిపారు మాజీ టీ.టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ. ఒక వక్తితో పార్టీలు నడవవన్న ఆయన పార్టీల్లోకి వ్యక్తులు రావడం, పోవడం సహజమన్నారు. టీఆర్ఎస్ చేరడానికి ఎలాంటి పదవి ఆశించలేదన్నార టీ.టీడీపీ మాజీ అధ్యక్షులు ఎల్.రమణ.
గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్.రమణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌లోకి రావాలసిందిగా కేసీఆర్ ఆయన్ను ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఆ భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీకి గుడ్‌బై చెప్పారు ఎల్.రమణ. త్వరలోనే ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Next Story




