జూన్ 8 నుంచి హైదరాబాద్‌లో నడవనున్న సిటీ బస్సులు?

జూన్ 8 నుంచి హైదరాబాద్‌లో నడవనున్న సిటీ బస్సులు?
x
Highlights

లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైన.. హైదరాబాద్‌లో బస్సులు నడవకపోవడంతో రాజధాని ప్రజలు ఇబ్బంది...

లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైన.. హైదరాబాద్‌లో బస్సులు నడవకపోవడంతో రాజధాని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కారణంగా రెండున్నర నెలలపాటు డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు మళ్లీ ఎప్పుడు రోడ్డెక్కుతాయని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ భేటీ అయ్యారు. జూన్ 8వ తేదీ నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు వెల్లడించారు. ఒకవేళ నగరంలో మళ్లీ బస్సు సర్వీసులు మొదలుపెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై మంత్రి అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడిపినప్పటికీ. హైదరాబాద్‌లో మాత్రం సిటీ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories