తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

* ఆస్పత్రి ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించడానికి తగిన చర్యలు * ఉద్యోగులకు భరోసా కల్పించిన సజ్జనార్

Sandeep Reddy
Updated on: 4 Sept 2021 9:45 PM IST
TSRTC MD Sajjanar Inspected Tarnaka RTC Hospital Today 04 09 2021
X

తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (ట్విట్టర్ ఫోటో)

TSRTC MD Sajjanar: హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఆస్పత్రిలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. 48 వేల మంది ఉద్యోగుల్లో 28 వేల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని తెలిపారు. ఓపి, ఎక్స్ రే, ఫార్మసీ, స్కానింగ్, బ్లడ్ శాంపిల్ రూమ్, ఈసీజీ విభాగాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యంపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు ఎండీ సజ్జనార్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story