రోడెక్కిన కార్గో బస్సు..

రోడెక్కిన కార్గో బస్సు..
x
Highlights

రాష్ట్రంలో జనతా బంద్ నిర్వహించిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ను విధించింది.

రాష్ట్రంలో జనతా బంద్ నిర్వహించిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ను విధించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రధాన రహదారులన్నీ నిర్మాణుష్యంగా మారాయి. అప్పుడో ఇప్పుడో ప్రయివేటు వాహనాలు రోడ్డుపై దర్శనం ఇచ్చినప్పటికీ ఆర్టీసీ బస్సులు మాత్రం రోడెక్కలేదు. కాగా శుక్రవారం మాత్రం ఓ కార్గో బస్సు రోడ్డుపై తిరిగింది. జనగామ–సూర్యాపేట రహదారిలో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రజలందరూ ఆ బస్సును ఆసక్తిగా చూశారు.

హమ్మయ్య బస్సు రోడెక్కింది కదా ఎక్కడికైనా వెళ్లొచ్చనుకుంటే పొరపాటే. ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాలకు బాలామృతం ఇతర వస్తువును తరలించడానికి ఆ బస్సును నియమించారు. హైదరాబాద్‌లోని కాచిగూడ డిపోకు చెందిన బస్సుకు ప్రత్యేకంగా ఓ డ్రైవర్ ను నియమించి మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి వస్తువును ప్రభుత్వం పంపించింది.

ఇక పోతే దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. శనివారం సాయంత్రంలోగా కొత్త మార్గదర్శకాలతో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. కరోనాను కట్టడం చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే ఖచ్చితమైన మార్గమని పలువురు చేసిన సూచనలను ప్రధాని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలస్తోంది.

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపు విషయంపై శనివారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ పొడగింపుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపుగా మొగ్గు చూపినట్లు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories