TSRTC: పెళ్లిళ్ల సీజన్‌.. టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌...!

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 9 Feb 2023 3:19 PM IST
TSRTC Announces 10 Percent Discount on Bus Booking
X

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌.. టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌...!

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. శుభకార్యాల కోసం అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ గురువారం ప్రకటించింది. అన్ని రకాల బస్‌ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అద్దె బస్సుల బుకింగ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story