TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ మొబైల్‌లో మహిళల నగ్న ఫోటోలు, దృశ్యాలు

TSPSC Paper Leakage issue
x

TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ మొబైల్‌లో మహిళల నగ్న ఫోటోలు, దృశ్యాలు

Highlights

TSPSC: AE పరీక్ష పత్రం కూడా యువతి కారణంగా లీక్ అయిందని తేల్చిన పోలీసులు

TSPSC: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి పోలీసుల నిర్ణయించారు. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ స్త్రీలోలుడుగా పోలీసులు తేల్చారు. 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రవీణ్ చేరాడు. నాలుగేళ్లపాటు వేరిఫికేషన్‌ సెక్షన్‌లో పనిచేశాడు. దరఖాస్తు చేసుకున్న సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి, మహిళలతో ప్రవీణ్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పలువురు మహిళలతో ప్రవీణ్ శారీరక సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ వాట్సప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫోటోలు, దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు.

ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు టీఎస్‌పీఎస్సీ సమావేశం కానుంది. సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్ అధ్యక్షతన భేటీకానున్నారు. పరీక్ష పేపర్ లీకేజీపై చర్చించనున్నారు. రద్దు చేయాలా లేక లీక్‌ పేపర్ అందిన వారిని తొలగించి.. ముందుకు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బాధ్యులైన ఇద్దరిపై చర్యలు తీసుకోనున్న కమిషన్.

Show Full Article
Print Article
Next Story
More Stories