TSPSC: TSPSC పేపర్‌ లీకేజీ కేసులో విస్తుపోయే అంశాలు

TSPSC: ఏఈ పేపర్‌ లీకేజీతో రూ.25 లక్షలు వసూలు చేసిన డాక్యా నాయక్‌

Dhatripriya
Published on: 30 March 2023 12:37 PM IST
TSPSC Paper Leakage Case Shocking Updates
X

TSPSC: ఏఈ పేపర్‌ లీకేజీతో రూ.25 లక్షలు వసూలు చేసిన డాక్యా నాయక్‌

TSPSC: ప్రకంపనలు సృష్టిస్తున్న TSPSC పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిట్ విచారణలో తవ్వే కొద్దీ నిజనిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడు డాక్యా నాయక్ ఏఈ పేపర్‌తో దాదాపు 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పేపర్ కోసం నీలేశ్, గోపాల్ నాయక్ 13.5 లక్షల రూపాయలు చెల్లించారు. వీరిద్దరూ పొలం తాకట్టు పెట్టి పేపర్‌ను కొనుగోలు చేశారు. అలాగే రాజేందర్ 5లక్షలు, ప్రశాంత్ 7.5 లక్షల రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రం కోసం ప్రశాంత్ బంగారం తాకట్టు పెట్టి మరీ 7 లక్షలు తెచ్చినట్లు విచారణలో బయటపడింది. దీంతో డాక్యా నాయక్ బ్యాంక్ ఖాతాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story