TSPSC: TSPSC పేపర్‌ లీక్‌ కేసు విచారణ జూన్‌ 5కు వాయిదా

TSPSC: కేసు స్టేటస్‌ రిపోర్టును జూన్‌ 5లోగా సమర్పించాలని ఆదేశం

Dhatripriya
Published on: 28 April 2023 12:01 PM IST
TSPSC Paper Leak Case Hearing Adjourned To June 5
X

TSPSC: TSPSC పేపర్‌ లీక్‌ కేసు విచారణ జూన్‌ 5కు వాయిదా

TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. TSPSC పేపర్‌ లీక్‌ కేసు విచారణను హైకోర్టు జూన్‌ 5కు వాయిదా వేసింది. ఇక ఎన్ని రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తారని కోర్టు ప్రశ్నించింది. కేసు స్టేటస్‌ రిపోర్టును జూన్‌ 5లోగా సమర్పించాలని ఆదేశించింది.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తుపై కొంతవరకే సంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా వేగంగా దర్యాప్తు జరగాలని అభిప్రాయపడింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జూన్ ఐదు నాటికి తదుపరి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది.

Dhatripriya

Dhatripriya

Next Story