TSPSC: TSPSC పేపర్‌ లీక్‌ కేసు విచారణ ఏప్రిల్ 24 కు వాయిదా

TSPSC: కేసును సీబీఐకి అప్పగించాలన్న బల్మూరి వెంకట్‌ పిటిషన్‌పై వాదనలు

Jyothi
Published on: 11 April 2023 4:56 PM IST
TSPSC Paper leak case hearing adjourned to April 24
X

TSPSC: TSPSC పేపర్‌ లీక్‌ కేసు విచారణ ఏప్రిల్ 24 కు వాయిదా

TSPSC: తెలంగాణ హైకోర్టులో TSPSC పేపర్‌ లీక్‌ కేసు విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాలన్న బల్మూరి వెంకట్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కేసు విచారణలో ఉండగా ఐటీ మంత్రి ఇద్దరు నిందితులు మాత్రమే పేపర్‌లీక్‌లో ఉన్నారనడంపై అనుమానం ఉందని పిటిషనర్‌ తరఫు లాయర్‌ కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటకు వస్తాయని కోరారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, మొత్తం 18 మంది నిందితుల్లో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేశామని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యూజిలాండ్‌లో ఉన్న మరో నిందితుడిని కూడా త్వరలోనే విచారిస్తామన్నారు. నిందితులను చట్ట ప్రకారం అరెస్ట్‌ చేసి జైలుకి పంపించామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

Jyothi

Jyothi

Next Story