Telangana: బీజేపీలోకి మరో తెలంగాణ ఉద్యమ నేత.. తెరవెనుక చక్రం..

Telangana: మరో ఉద్యమకారుడు బీజేపీ గూటికి చేరుకోనున్నారు.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 3:59 PM IST
TSPSC EX Member Vital may Join in BJP
X

Telangana: బీజేపీలోకి మరో తెలంగాణ ఉద్యమ నేత.. తెరవెనుక చక్రం..

Telangana: మరో ఉద్యమకారుడు బీజేపీ గూటికి చేరుకోనున్నారు. మాజీ టీఎస్‌పీఎస్సీ సభ్యుడు, టీఎన్జీవో మాజీ నాయకుడు విఠల్ త్వరలో కాషాయ కండువ కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీ సభ్యుడుగా నియామకం అయ్యారు. అయితే ఆయన పదవీకాలం పూర్తయిన తరువాత మళ్లీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న విఠల్ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది.

బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అయితే ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన విఠల్‌ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారనే చర్చ జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story