రూ.58 లక్షల ఫ్యాకేజీతో పెద్ద ఉద్యోగం.. చేరేలోపే గుండెపోటుతో మృత్యుఒడికి..

రూ.58 లక్షల ఫ్యాకేజీతో పెద్ద ఉద్యోగం.. చేరేలోపే గుండెపోటుతో మృత్యుఒడికి..

Arun Chilukuri
Published on: 27 Sept 2022 1:03 PM IST
TSMSIDC MDs son Abhijith Reddy Died due to Heart Stroke
X

రూ.58 లక్షల ఫ్యాకేజీతో పెద్ద ఉద్యోగం.. చేరేలోపే గుండెపోటుతో మృత్యుఒడికి..

Abhijith Reddy: తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (TSMSIDC) ఎండీ కె చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమారుడు కట్టా అభిజిత్‌ రెడ్డి (22) గుండె పోటుతో మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే అభిజిత్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిజిత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.

వరంగల్‌ నిట్‌లో చదివిన అభిజిత్‌.. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీ 'సౌదీ అరామ్‌కో'లో ఉన్నత ఉద్యోగం సాధించాడు. ఏడాదికి 70 వేల అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ.58 లక్షలు) వేతనం. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్‌ ఉన్నట్టుండి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story