Weather Report: తెలంగాణలో మూడు రోజులు దంచికొట్టనున్న ఎండలు..!

TS Weather Update Sun Intensity Increase In Telangana Next Three Days
x

Weather Report: తెలంగాణలో మూడు రోజులు దంచికొట్టనున్న ఎండలు..!

Highlights

Weather Report: 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణో్గ్రతలు నమోదయ్యే అవకాశం

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో రాగలమూడు రోజుల్లో ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సుమారు 42 నుంచి 44 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు. ఉదయం పది దాటినతరువాత మధ్యాహ్నం మూడు గంటలకు ముందు ప్రజలు బయట తిరగవద్దని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories