KTR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నయాపైసా సాయం లేదు

KTR: చేనేత కార్మికులకు 50శాతం రాయితీ అందిస్తున్నాం

Rama Rao
Updated on: 4 Feb 2022 8:15 AM IST
TS Minister KTR Visits Rajanna Sircilla District | TS News Today
X

KTR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నయాపైసా సాయం లేదు

KTR: ఏడున్నరేళ్ళుగా ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా కేంద్రం తెలంగాణకు నయాపైసా సాయం చేయలేదని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో నేతన్నల సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా చేనేత కార్మికులకు 50శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story