మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. దసరా సెలవులు మూడు రోజులే..

Arun Chilukuri
Published on: 11 Sept 2020 10:35 AM IST
మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. దసరా సెలవులు మూడు రోజులే..
X

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదలైంది. జూనియర్‌ కాలేజీల అకడమిక్‌ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్‌ బోర్డు గురువారం విడుదల చేసింది. మొత్తం 182 పనిదినాలను లెక్కించారు. కొవిడ్‌ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరంలో 228 నుంచి గరిష్ఠంగా 46 పనిదినాలు తగ్గించారు. దసరా సెలవులు అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు మూడ్రోజులు ప్రకటించారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13, 14 తేదీలుగా ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాలకు అనుగుణంగా క్యాలెండర్‌లో స్వల్ప మార్పులుంటాయని ఇంటర్‌బోర్డు పేర్కొన్నది.

ఇంటర్‌ బోర్డు విద్యా క్యాలెండర్‌ ఇలా..

మొత్తం పనిదినాలు 182

తరగతులు ప్రారంభ తేదీ సెప్టెంబర్‌ 1, 2020

కాలేజీలకు చివరి పని రోజు ఏప్రిల్‌ 16, 2021

ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి 27, 2021

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20, 2021

ఇంటర్‌ థియరీ పరీక్షలు మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12, 2021

వేసవి సెలవులు ఏప్రిల్‌ 17 నుంచి మే 31, 2021

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ మే చివరి వారం, 2021

నూతన విద్యా సంవత్సరం జూన్‌ 1, 2021

Arun Chilukuri

Arun Chilukuri

Next Story