TSPSC: TSPSC కేసులో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు

TSPSC: కేసును సీబీఐకి అప్పగించాలని NSUI పిటిషన్‌

Dhatripriya
Published on: 28 April 2023 10:06 AM IST
TS High Court Verdict In TSPSC Case Today
X

TSPSC: TSPSC కేసులో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. పేపర్ లీకేజ్ కేసును సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలంటూ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI ఓ పిటిషన్ దాఖలు చేసింది. TSPSC పరీక్షలు రద్దు, వాయిదా సబబేనని గత విచారణలో హైకోర్టు కామెంట్ చేసింది. అయితే సిట్ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి, మంత్రి కేటీఆర్ జోక్యం ఉందని పిటిషనర్ బల్మూరు వెంకట్ ఆరోపిస్తున్నారు. మరోవైపు సిట్ విచారణ కీలక దశలో ఉన్నందున సీబీఐకి కేసు అప్పగించాల్సిన అవసరం లేదని ఏజీ గత విచారణలో హైకోర్టుకు చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story