TS High Court Deadline: 48గంటల్లోగా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి

TS High Court Deadline: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్ విధించింది.

Arun Chilukuri
Published on: 19 April 2021 5:13 PM IST
TS High Court Deadline for Govt Over Corona Precautions
X

TS High Court Deadline: 48గంటల్లోగా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి 

TS High Court Deadline: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు 48గంటల్లోగా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో తామే ఆదేశాలిస్తామని హెచ్చరించింది. డీజీపీ, వైద్యాధికారులు ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందన్న ధర్మాసనం జీహెచ్‌ఎంసీలో నమోదైన కేసులను వార్డుల వారీగా సమర్పించాలని ఆదేశించింది. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, జనం గుంపులుగా ఉండే ప్రదేశాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story