తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

X
Highlights
Common Entrance Tests: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
Arun Chilukuri22 Aug 2020 6:46 AM GMT
Common Entrance Tests: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్, సెప్టెంబరు 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, సెప్టెంబరు 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్, సెప్టెంబరు 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, సెప్టెంబరు 30, అక్టోబరు 1న టీఎస్ ఐసెట్, అక్టోబరు 1 3వరకు ఎడ్‌సెట్, అక్టోబరు 4న లాసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని పరీక్షలకు కూడా కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన స్టూడెంట్స్‌కు ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Web TitleTS govt announces schedule for EAMCET and other common entrance tests
Next Story