తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

X
Highlights
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లో ఈ సెట్ ఫలితాలను ఉన్నత...
Arun Chilukuri11 Sep 2020 11:55 AM GMT
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లో ఈ సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో గత నెల 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలోనూ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం శుభపరిణామం అని అన్నారు. పరీక్ష నిర్వహణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో చూసుకోవచ్చని వెల్లడించారు.
Web TitleTS ECET 2020 results declared
Next Story