TS EAMCET, LAWCET 2021: టీఎస్ ఎంసెట్‌, లాసెట్‌ లాస్ట్‌డేట్ పొడగింపు

TS EAMCET, LAWCET 2021: తెలంగాణలో ఎంసెట్‌, లాసెట్ దరఖాస్తుల గడువును జూన్‌ 3 వరకు పొడిగించారు.

Venkata Chari
Published on: 27 May 2021 3:42 PM IST
TS Eamcet Lawcet 2021 Application Submission Date Extended Till 3rd June 2021
X

తెలంగాణ ఎంసెట్, లాసెట్ (ఫొటో ట్విట్టర్)

TS EAMCET, LAWCET 2021: తెలంగాణలో ఎంసెట్‌, లాసెట్ దరఖాస్తుల గడువును జూన్‌ 3 వరకు పొడిగించారు. ఎలాంటి లేట్‌ ఫీజు లేకుండా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈమేరకు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ వెల్లడించారు. బుధవారం వరకు 2,01,367 మంది విద్యార్థులు ఎంసెట్ కు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్‌ కోసం 1,35,151 మంది, అగ్రికల్చర్‌ కోసం 66,216 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు.

అలాగే లాసెట్‌ దరఖాస్తుల గడువును వచ్చే నెల 3 వరకు పొడిగించడంతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్‌ కమిటీ పేర్కొంది.

Venkata Chari

Venkata Chari

Next Story