ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీజిబీజి.. ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి...

KCR - Delhi Tour: సాగు చట్టాల పోరులో చనిపోయిన రైతు కుటుంబాలకు కేసీఆర్ పరామర్శ...

Shireesha
Published on: 21 May 2022 9:51 AM IST
TS CM KCR Busy in Delhi Tour | Live News Today
X

ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీజిబీజి.. ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి...

KCR - Delhi Tour: జాతీయ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీజిబీజిగా గడుపుతున్నారు. జాతీయ, రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యామ్నాయమే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. మూడు సాగుచట్టాల రద్దు కోసం సాగిన పోరాటంలో అసువులు బాసిన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శించి, ఆర్థిక సహాయం చేయనున్నారు.

ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. చండీగఢ్‌లో రైతు అమరవీరుల కుటుంబాలకు చెక్కులు అందజేస్తారు. మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్దిలో అన్నాహజారేతో భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లోనూ పర్యటించనున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, రంగాల ప్రముఖులతో ప్రత్యే సమావేశాలు నిర్వహించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో కూడా భేటీ కానున్నారు.

Shireesha

Shireesha

Next Story