Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి

Arun Chilukuri
Updated on: 12 Sept 2021 6:00 PM IST
TS BJP President Bandi Sanjay Open Letter to CM KCR about Telangana Liberation Day September 17
X

సీఎం కెసిఆర్ - బండి సంజయ్(ఫోటో ది హన్స్ ఇండియా ) 

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేయించాలని, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి కేంద్రం ఆర్థిక సహాయంతో నిర్మాణం చేపట్టాలని కోరారు. రజాకార్ల చేతిలో బలైన కుటుంబాలకు ప్రభుత్వం సన్మానం చేయాలన్నారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురువేయించాలన్నారు. తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రజాకార్ల చేతిలో బలైన వారి కుటుంబాలను అధికారికంగా ప్రభుత్వం సన్మానించాలన్నారు. రజాకార్లను తరిమి కొట్టిన బైరాన్‌పల్లి, వరంగల్ కోట, రేణికుంట, కడవెండి, కామారెడ్డిగూడెం, పరకాల, సూర్యాపేట, బీబీనగర్, బాలెంల తదితర ప్రాంతాలతో పాటు, తెలంగాణ విమోచనోద్యమ ఘట్టాలను పరిరక్షించాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story