TS Assembly Budget 2024: అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్స్‌కు ప్రిపేర్ అవుతోన్న తెలంగాణ ప్రభుత్వం

TS Assembly Budget 2024: కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్

Shekhar G
Updated on: 24 Jan 2024 5:30 PM IST
TS Assembly Budget 2024 Meeting Starts From February 14
X

TS Assembly Budget 2024: అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్స్‌కు ప్రిపేర్ అవుతోన్న తెలంగాణ ప్రభుత్వం

TS Assembly Budget 2024: తెలంగాణ ప్రభుత్వం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ఫిబ్రవరిలోనే నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14 నుంచి సమావేశాలను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా కేంద్ర బడ్జెట్‌లో తమకు మంజూరైన గ్రాంట్లు, స్పెషల్‌ గ్రాంట్లను పరిశీలించిన అనంతరం రాష్ట్రాలు తమ బడ్జెట్‌లను ప్రవేశపెడుతుంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. దీంతో కేంద్ర బడ్జెట్‌ను చూసిన తర్వాతే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌నే ప్రవేశపెడుతుందా, లేక పూర్తి స్థాయి బడ్జెట్‌ను పెడుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

Shekhar G

Shekhar G

Next Story