TRSLP Meeting: నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

*సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశం *ఈ నెల 25న జరిగే ప్లీనరీపై చర్చ

Shilpa
Published on: 17 Oct 2021 8:24 AM IST
TRSLP Meeting at Telangana Bhavan Today 17 10 2021
X

నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం(ఫైల్ ఫోటో) 

TRSLP Meeting: ఇవాళ టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 25న జరగనున్న పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ప్లీనరీపై సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు, పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఈ రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కేసీఆర్ తరపున టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామినేషన్లు వేయనున్నారు. 25వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్‌ అధికారిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు.

Shilpa

Shilpa

Next Story