Telangana: మినీ మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ

TRS wins two Municipal Corporations and Five Municipalities in the State
x

Telangana: మినీ మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ



Highlights

Telangana: సాగర్‌లో బైపోల్‌లో విక్టరీ కొట్టిన గులాబీ పార్టీ జోష్ కంటిన్యూ అవుతోంది. సోమవారం విడుదలైన మినీ మున్సిపోల్స్‌లోనూ కారు జోరుగా దూసుకెళ్లింది.

Telangana: సాగర్‌లో బైపోల్‌లో విక్టరీ కొట్టిన గులాబీ పార్టీ జోష్ కంటిన్యూ అవుతోంది. సోమవారం విడుదలైన మినీ మున్సిపోల్స్‌లోనూ కారు జోరుగా దూసుకెళ్లింది. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. ఇక వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్‌ జోష్‌ వచ్చింది.

నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు ఆరుగురు గెలిచారు. అటు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని అధికార పార్టీ 7 స్థానాలను సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్‌లలో గెలిచింది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్‌ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి.

మరోవైపు మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. ఇక సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్‌ రావు మ్యాజిక్‌ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. అధికార పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అందరూ భావించినా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది.

ఇటు కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. వరంగల్‌లో 66 డివిజన్లలో 48 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, నాలుగు చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. స్వతంత్రులు నలుగురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. 43 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 10 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంటే సీపీఐ 2, సీపీఎం 2, స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories