టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా.. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
* స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ * అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి
టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా(ఫైల్ ఫోటో)
TRS Vijayagarjana Sabha: టీఎర్ఎస్ ప్లీనరీ తర్వాత వరంగల్ నగరంలోనే ఈ నెల 15న పది లక్షల మంది జనాభాతో భారీ బహిరంగ ఏర్పాటు చేయనున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలతో పాటు సమయం ఎక్కువగా లేకపోవడంతో సభను వాయిదా వేశారు.
దీంతో ఈనెల 15కు బదులు 29న నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో టీఆర్‌ఎస్ విజయగర్జన సభ మరోసారి వాయిదా పడింది.
Next Story




