రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ ఆత్మపరిశీలన

రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ ఆత్మపరిశీలన
x

Highlights

గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాల అజెండా, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి...

గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాల అజెండా, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై గులాబీ బాస్ దృష్టి సారించారు.

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది గులాబీ పార్టీ. పార్టీలో వివిధ సంస్థాగత అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర కార్యవర్గం ఈనెల 7న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎమ్​ఎస్​ అధ్యక్షులు హాజరు కానున్నారు.

ఆదివారం జరిగే ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఏప్రిల్ 27న జరిగే పార్టీ ప్లీనరీ సభ సహా ఇతర సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న గ్రాడ్యూయోట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కూడా కార్యవర్గ సమావేశంలో పార్టీశ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

అయితే, గత కొంత కాలంగా బీజేపీ దూకుడుతో ఇబ్బంది పడుతున్న కారు పార్టీ ఆత్మపరిశీలన చేసుకోనుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో తేలిన అంశాలను కేసీఆర్ పార్టీ నేతలకు వివరించి వరుసగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఇటీవల కొందరు పార్టీ నేతల వైఖరి వివాదాస్పదంగా మారుతున్నందున ఇకపై అలాంటి వ్యవహారాలకు చోటు లేకుండా కేసీఆర్‌ స్పష్టమైన సూచనలు చేయనున్నారు.

మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనంతరం రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్ర, ముఖ్యంగా రైతు ఉద్యమం, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేటీఆర్​ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారినందున ఆ అంశంపైనా కేసీఆర్​ స్పష్టత ఇస్తారని యావత్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి చాలాకాలంగా పార్టీ శ్రేణులు వివిధ అంశాలపై ఉన్న కన్ఫ్యూజన్ పై కేసీఆర్ క్లారిటి ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories