టీఆర్ఎస్.. బీజేపీ.. కరోనా కేంద్రంగా రాజకీయ యుద్ధం!

టీఆర్ఎస్.. బీజేపీ.. కరోనా కేంద్రంగా రాజకీయ యుద్ధం!
x
Highlights

తెలంగాణలో అధికార పార్టీ శత్రుశేషం లేకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే సెంటిమెంటుతో టిడిపిని, రాష్ట్రం సాధించామని కాంగ్రెస్ ని ఖతం చేసిన టీఆర్ఎస్ ...

తెలంగాణలో అధికార పార్టీ శత్రుశేషం లేకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే సెంటిమెంటుతో టిడిపిని, రాష్ట్రం సాధించామని కాంగ్రెస్ ని ఖతం చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు తన దృష్టిని బీజేపీపై పెట్టింది. తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీని ఎన్నికల నాటికి తమ దరిదాపుల్లో కూడా లేకుండా చేయాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.

చిన్నపామునైనా పెద్ద కర్రతోనైనా కొట్టాలన్న థియరీని తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టిడిపిని సెంటిమెంటుతో ఉనికి లేకుండా చేసిన టిఆర్ఎస్ , రాష్ట్రం ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా నిలువరించడంలో సక్సస్ అయ్యింది. అంతర్గత కుమ్ములాటలతోనే కాంగ్రెస్ సతమతమవుతుంటే బీజేపీ మాత్రం అధికార పార్టీ పై పోరుకు సన్నద్ధమవుతోంది. కరోనా కట్టడిలో వైఫలం అంటూ బీజేపీ అధికార పార్టీపై దాడికి దిగుతుంటే ఎదురుదాడి చేయడానికి వ్యూహాత్మకంగా టిఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే అవకాశం దొరకినప్పుడల్లా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిని టిఆర్ఎస్ టార్గెట్ చేస్తూ వస్తోంది. గతంలో రాష్ట్రానికి కేటాయించే నిధుల విషయంలో ఎదురుదాడి చేసి రాష్ట్ర ప్రజల్లో బిజేపి పై వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నం చేసింది. తాజగా బిజేపి జాతీయాధ్యక్షుడు చేసిన వాఖ్యలను టిఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహరం పై వరుస ఆందోళలనలకు బీజేపీ పిలుపునిచ్చింది.

కేంద్రం కరోనా నిధుల విషయంలో రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని, తాజాగా కేంద్రం నుంచి రావాల్సిన పరికరాలను కూడా రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటోందని కేసీఆర్ ప్రభుత్వం ఎదురు దాడి చేసింది. బిజేపికి సొంతపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పై ఉన్న ప్రేమ తెలంగాణ పై లేదని విమర్శించింది. అయితే బిజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉందని టీఆరెస్ ఆరోపించింది. అయితే అధికార టిఆర్ఎస్ పార్టీ శత్రుశేషం లేకుండా చేస్తున్న ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories