Vice-President Election: మార్గ‌రేట్ అల్వాకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు..

Vice-President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు విపక్షాల అభ్యర్థిగా ఎన్నికైన మార్గరెట్ అల్వాకే ఇస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 5 Aug 2022 12:33 PM IST
TRS Supports Margaret Alva in Vice-President Election
X

Vice-President Election: మార్గ‌రేట్ అల్వాకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు.. 

Vice-President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు విపక్షాల అభ్యర్థిగా ఎన్నికైన మార్గరెట్ అల్వాకే ఇస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. రేపు పార్లమెంటు భవనంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని తెలిపింది. మార్గ‌రేట్ అల్వాకు మద్దతునివ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story