Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ దాష్టీకం

Vikarabad: గ్రామ సమస్యలపై ప్రశ్నించిన సామాన్యుడిపై దాడి

Sandeep Eggoju
Published on: 22 Sept 2021 10:57 AM IST
TRS Sarpanch Attack on a Common Man in Vikarabad
X
వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ సర్పంచ్ దాష్టీకం 

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ రెచ్చిపోయాడు. గ్రామంలోని సమస్యలపై ప్రశ్నించిన పాపానికి ఓ సామాన్యుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ప్రజలు చూస్తుండగానే బూటు కాలితో తన్నుతూ చికతబాదాడు. మార్పల్లి మండల పరిధిలోని దామస్థాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని నీటి సమస్య, డ్రైనేజీ సమస్యపై దృష్టి పెట్టాలని సర్పంచ్‌ జైపాల్‌రెడ్డిని బాధితుడు పిట్టల శ్రీనివాస్‌ కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన సర్పంచ్‌ శ్రీనివాస్‌ను దూషిస్తూ దాడి చేశాడు. ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story