Top
logo

టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యుర్థుల మూడో జాబితా విడుదల

టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యుర్థుల మూడో జాబితా విడుదల
X
Highlights

గ్రేటర్ ఎన్నికలకు ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు...

గ్రేటర్ ఎన్నికలకు ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను, 20 మందితో రెండో జాబితాను విడుదల చేసిన టీఆర్ఎస్‌ కాసేపటి క్రితం మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 25 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది టీఆర్ఎస్‌ అధిష్టానం. దీంతో మొత్తం 150 మంది అభ్యర్థులను అన్ని డివిజన్లలో బరిలోకి దింపింది.

ఏఎస్‌రావునగర్- పావనిరెడ్డి, చర్లపల్లి-బొంతు శ్రీదేవి యాదవ్(మేయర్ రామ్మోహన్ భార్య), మీర్‌పేట్-ప్రభుదాస్, నాచారం-సాయిజెన్‌ శేఖర్, చిలకనగర్-బన్నాల ప్రవీణ్‌ ముధిరాజ్, హబ్సిగుడ-బేతి స్వప్న రెడ్డి, ఉప్పల్-అరిటికాయల భాస్కర్, అత్తాపూర్-మాధవి, కాచిగూడ-శిరీష యాదవ్, నల్లకుంట-గరిగంటి శ్రీదేవి, అంబర్‌పేట్-విజయ్‌కుమార్ గౌడ్, అడిక్‌మెట్-హేమలతారెడ్డి, ముషీరాబాద్ - భాగ్యలక్ష్మి యాదవ్, కవాడిగూడ-లాస్యనందిత, తార్నాక-మోతే శ్రీలత, యూసఫ్‌గూడ-రాజ్‌కుమార్ పటేల్, వెంగల్‌రావు నగర్-దేదిప్య రావు, రెహమత్‌రావు నగర్-సీఎన్ రెడ్డి, నేరేడ్‌మెట్-మీనా ఉపేందర్‌రెడ్డి, ఈస్ట్ ఆనంద్‌బాగ్-ప్రేమ్‌కుమార్, గౌతమ్‌నగర్-మేకల సునీత రాముయాదవ్, గోల్‌నాక-దూసరి లావణ్య, చందానగర్-మంజుల రఘునాథ్‌రెడ్డి, హైదర్‌నగర్-నార్నే శ్రీనివాస్‌యాదవ్, మౌలాలి-ముంతాజ్ ఫాతిమా తదితరుల జాబితాను టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది.

Web TitleTRS releases 3rd list of candidates for ghmc elections
Next Story