Khammam: మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌ వీరే

Khammam:తెలంగాణలో జరిగిన 2 కార్పొరేషన్‌, 5మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగరవేసింది.

Samba Siva Rao
Updated on: 7 May 2021 6:32 PM IST
Khamm Mayor and D.Mayor
X

ఖ‌మ్మం మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్

Khammam: తెలంగాణలో జరిగిన 2 కార్పొరేషన్‌, 5మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగరవేసింది. కార్పొరేషన్‌లకు మేయర్‌, ఉప మేయర్‌, మున్సిపాలిటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల విషయమై టీఆర్‌ఎస్‌ సమాలోచనలు చేసి ఎట్టకేలకు వారిని ప్రకటించింది.

ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. మేయ‌ర్‌గా పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌గా ఫాతిమా జోహ్రో పేర్ల‌ను ఖ‌రారు చేశారు. వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ ప‌ద‌వికి రిజ్వాన షమీకి ద‌క్కింది.

సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌: కడవేర్గు మంజుల, వైస్‌ చైర్మన్‌: జంగిటి కనకరాజు, అచ్చంపేట మున్సిపల్‌ చైర్మన్‌: ఎడ్ల నరసింహ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ పోరెడ్డి శైలజారెడ్డి, కొత్తూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ దోలి రవీందర్‌ జడ్చర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దోరెపల్లి లక్ష్మీ, నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పేర్లను ఎంపిక చేసారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story