ప్రధాని మోడీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్

Privilege Motion: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై నోటీసులు. రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసులు అందజేసిన టీఆర్ఎస్ ఎంపీలు.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 12:13 PM IST
TRS Privilege Motion on Prime Minister Modi
X

ప్రధాని మోడీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్

Priviege Motion: రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను ఆ పార్టీ ఎంపీలు కె.కేశవరావు , సంతోష్‌కుమార్‌, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ కలిసి నోటీసు అందజేశారు. ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని.. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు.

ఇటీవల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ ఆంధ్రప్రదేశ్‌ విభజన అవమానకరంగా జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story