టీఆర్‌ఎస్ జైత్రయాత్రను గాంధీనగర్ నుంచే ప్రారంభిస్తాం : ఎమ్మెల్సీ కవిత

X
Highlights
టీఆర్ఎస్ జైత్రయాత్ర గాంధీనగర్ నుంచే ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పేద...
Arun Chilukuri19 Nov 2020 10:43 AM GMT
టీఆర్ఎస్ జైత్రయాత్ర గాంధీనగర్ నుంచే ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పేద ప్రజల నోటికాడి ముద్దను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లాక్కున్నాయని విమర్శించారు. పేదలకు, వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే ఈసీకి ఫిర్యాదులు చేశారని దుయ్యబట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు, కాంగ్రెస్, బీజేపీకి లేవని అన్నారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే ఈ రెండు పార్టీలు కరోనా, వరదల సమయాల్లో నగర ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు కవిత.
Web TitleTRS pilgrimage will start from Gandhinagar says MLC Kavitha
Next Story