కేంద్రంపై టీఆర్‌ఎస్ యుద్ధం.. ఢిల్లీలో దీక్ష.. గల్లీ నుంచి ఢిల్లీకి మారిన వరి యాక్షన్ ప్లాన్

TRS Party Protest in Delhi on Paddy Procurement | KCR | Live News
x

కేంద్రంపై టీఆర్‌ఎస్ యుద్ధం.. ఢిల్లీలో దీక్ష.. గల్లీ నుంచి ఢిల్లీకి మారిన వరి యాక్షన్ ప్లాన్

Highlights

TRS Protest: పాల్గొననున్న మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు...

TRS Protest: వరి యాక్షన్ ప్లాన్ గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. ఢిల్లీ వేదిక నుంచి గర్జించడానికి పూనుకుంది గులాబీ పార్టీ. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దీక్ష చేపట్టనుంది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ దీక్షలో పలువురు తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఈ నెల 4 నుంచి టీఆర్‌ఎస్‌ ఆందోళన బాట పట్టింది.

కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ఏకంగా ఇవాళ ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీకి రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లతో పాటు టీఆర్ఎస్ కీలక నేతలను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకుంటే కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ రాగానే మంత్రిమండలి సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల కోసం తెలంగాణ భవన్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. దీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, గోపీనాథ్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ తదితరులు దీక్షా వేదిక ఏర్పాటు పనులను పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories