TRS Party Plenary: ప్లీనరీకి వచ్చే వారికోసం 33 రకాల వంటకాలు

TRS Party Plenary: తెలంగాణ ప్రత్యేకతలను తెలిపే విధంగా, స్వీట్లతో 33 రకాల వంటకాలను సిద్ధం చేశారు...

Shireesha
Published on: 25 Oct 2021 8:48 AM IST
TRS Party Plenary 33 types of Special Dishes for Guests | Telangana Latest News
X

TRS Party Plenary: ప్లీనరీకి వచ్చే వారికోసం 33 రకాల వంటకాలు 

TRS Party Plenary: టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రతినిధులకు పసందైన భోజనం వడ్డించనున్నారు. ప్రతి సందర్భంలోనూ భోజనాలకు, ప్రత్యేకించి సామూహిక భోజనాలకు ఎనలేని ప్రాముఖ్యమిచ్చే కేసీఆర్ మరోసారి టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతోన్న వేళ ప్లీనరీలో సైతం రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేకతలను తెలిపే విధంగా, స్వీట్లతో 33 రకాల వంటకాలను సిద్ధం చేశారు. మొత్తం 15 వేల మందికి సరిపడేలా భోజన ఏర్పాట్లు చేశారు.

హైటెక్స్‌లోని మూడు హాల్స్‌లో ప్రతినిధులకు భోజనం వడ్డిస్తారు. ఒకేసారి 8వేల మంది అతిథుల భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటు కోడి పులుపు, ఎగ్ మసాలా, నల్ల పొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు, రుమాల్ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, మిర్చి కా సాలన్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులసు, ముద్ద ప్పు, సాంబారు, ఉలవచారు, పెరుగు, పెరుగు చట్నీ, జిలేబీ, డబుల్ కా మీఠా, ఐస్‌క్రీం తదితరాలు వడ్డించనున్నారు.

Shireesha

Shireesha

Next Story