MLC Elections: గోవా క్యాంపునకు మధిర నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు

మధిర నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఆ పార్టీ నాయకులు గోవాకు తరలించారు

Arun Chilukuri
Published on: 30 Nov 2021 9:15 PM IST
TRS Party Leaders Shifted MPTC and JDPTC from Madhira Constituency in Khammam to Goa in the wake of MLC Elections
X

గోవా క్యాంపునకు మధిర నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు (ఫోటో- ది హన్స్ ఇండియా)

MLC ELections: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఆ పార్టీ నాయకులు గోవాకు తరలించారు. జిల్లాలోని మధిర నియోజకవర్గం ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో గోవా తరలించారు. పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి క్యాంపునకు బయలుదేరిన బస్సును జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు జెండా ఊపి ప్రారంభించారు.

ఎన్నికల ముందురోజు వరకు క్యాంపులోనే ఉండి ఎన్నిక సమయానికి వారు తమ నియోజకవర్గాలకు చేరుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా ఉండేందుకు క్యాంపునకు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story