L Ramana: ఎల్. రమణకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం..?

L Ramana: కాసేపట్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రగతిభవన్‌కు వెళ్లనున్నారు.

Arun Chilukuri
Published on: 8 July 2021 1:54 PM IST
TRS Offered MLC post to L Ramana ?
X

L Ramana: ఎల్. రమణకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం..?

L Ramana: కాసేపట్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రగతిభవన్‌కు వెళ్లనున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లనున్నారు ఎల్.రమణ. సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత వారం రోజుల్లో తెలంగాణ భవన్‌లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఎల్. రమణకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీతో పాటు హుజురాబాద్‌ కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎల్.రమణ తరహాలో మరికొందరు టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలతో టీటీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story