MLC Kavitha: బట్ట కాల్చి మీద వేస్తున్నారు.. ఇలాంటి వాటికి భయపడేది లేదు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 22 Aug 2022 1:02 PM IST
TRS MLC Kavitha Respond on Delhi Liquor Scam
X

MLC Kavitha: బట్ట కాల్చి మీద వేస్తున్నారు.. ఇలాంటి వాటికి భయపడేది లేదు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. తనపై రకరకాల కథనాలు వస్తున్నాయన్నారు. కేసీఆర్ బిడ్డను కాబట్టి బద్నాం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తనను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని అనుకుంటున్నారని, ఇలాంటి వాటికి భయపడేది లేదని చెప్పారు. కక్షపూరితంగా బీజేపీ తనపై ఆరోపణలు చేస్తోందని కవిత మండిపడ్డారు. ఇవన్నీ వ్యర్థ ప్రయత్నాలేనన్న కవిత దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story