హోం ఐసోలేషన్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

హోం ఐసోలేషన్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
x
Highlights

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా కవితను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు....

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా కవితను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ఐదురోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నారు. ఈ 5రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.

తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ క‌రోనా బారిన ప‌డ్డారు. ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ పలువురిని కలిసినట్టుగా తెలిసింది. నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను ఆయన సోమవారం కలిసి అభినందించారు. కొద్ది రోజుల కిందట ఆయన కరోనా రోగులకు సేవలందించారు. ఎమ్మెల్యే సంజయ్‌ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు ఆకాక్షించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories