Warangal: పరకాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

Warangal: సమావేశంలో పాల్గొన్న ఎమ్మోల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి * మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ పసునూరి.

Sandeep Eggoju
Published on: 26 Feb 2021 6:03 PM IST
Warangal: పరకాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
X

Warangal: తెలంగాణ రాష్ట్రం 14.2 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో ఉందని వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మోల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజేశ్వర్ రెడ్డితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనుల గురించి వివరించారు. కరోనా వల్ల ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు కొన్ని అమలు చేయలేకపోయామని వాటన్నిటిని టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలో చేపట్టనుందని తెలిపిన ఎర్రబెల్లి బీజేపీ పై పలు విమర్శలు చేసారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story