టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ‌్యలు.. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దన్న..

TRS MLA Vidyasagar Rao makes controversial comments on ayodhya ram mandir
x
Highlights

కోరుట్ల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ‌్యలు చేశారు. అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు....

కోరుట్ల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ‌్యలు చేశారు. అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే మనకెందుకు అన్నారు. రామమందిరం పేరుతో బీజేపీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము కూడా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా? అంటూ బీజేపీ లీడర్లపై ఎమ్మెల్యే విద్యాసాగర్‌ మండిపడ్డారు.

జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటూ ఆయన ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తుంటే, టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories