Rasamayi Balakishan: కేసీఆర్, కేటీఆర్, కవిత కంటే నేనే పెద్ద చదువులు చదివాను..

TRS MLA Rasamayi Balakishan Interesting Comments on his Education
x

Rasamayi Balakishan: కేసీఆర్, కేటీఆర్, కవిత కంటే నేనే పెద్ద చదువులు చదివాను..

Highlights

Rasamayi Balakishan: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Rasamayi Balakishan: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకంటే ఎక్కువే చదివానన్నారు. వీళ్లలో ఎవరూ తన అంత ఉన్నత చదువులు చదవలేదని గుర్తు చేశారు. అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈవిధంగా స్పందించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని దళితవిద్యార్ధులు ఉన్నత చదువులుచదవాలని సూచించారు. ఏ సౌకర్యాలు లేని నాడే అంబేద్కర్ పెద్ద చదువులు చదివి రాజ్యాంగం రాస్తే.. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తాను MA, M FIL, PHD చేశానని గుర్తు చేశారు అందుకే తనను డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తున్నారని గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories